Covid Response Ambulances: కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్‌ల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Update: 2020-07-30 08:26 GMT

covid Response Ambulances:  కోవిడ్ రెస్పాన్స్‌ అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్‌ జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. కేటీఆర్‌ తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వానికి ఆరు అంబులెన్స్‌లను అందిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కేటీఆర్‌ సతీమణి శైలిమ, కుమార్తె అలేఖ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పలువురు అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్ కి తెలిపారు.



Tags:    

Similar News