AP MLC Elections 2023: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
AP MLC Elections 2023: అసెంబ్లీ ప్రాంగణంలోని మీటింగ్ హాల్‌లో కౌంటింగ్
AP MLC Elections 2023: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ ప్రాంగణంలోని మీటింగ్ హాల్‌లో కౌంటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. బరిలో 8 మంది అభ్యర్థులు నిలిచారు. ఓ వైపు.. 7 స్థానాల్లో వైసీపీయే గెలుస్తుందని, మరోవైపు.. ఒకస్థానంలో టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్‌లు జరగుతున్నాయి. లక్షల్లో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల అనుచరులు పందాలు కాశారు. అటు.. టీడీపీ గెలవడానికి ఒక ఓటు మాత్రమే అవసరం కావడంతో.. గెలుపు, ఓటములపై మరింత ఆసక్తి పెరిగిపోయింది.