Asifabad: ఆసిఫాబాద్‌లో రోడ్డెక్కిన పత్తి రైతులు
Asifabad: ఆసిఫాబాద్ జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
Asifabad: ఆసిఫాబాద్‌లో రోడ్డెక్కిన పత్తి రైతులు
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తిరైతులు గిట్టుబాటు ధర కోసం ఉద్యమించారు. పత్తికి గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్డెక్కినా జిల్లా కలెక్టర్ తమ స్పందించలేడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన పై స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పత్తి గిట్టుబాటు ధరపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తారని హామినిచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.