Coronavirus Updates in Telangana: తెలంగాణలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు!

Coronavirus Updates in Telangana : తెలంగాణ లో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,213 కేసులు నమోదు అయ్యాయి

Update: 2020-07-02 17:26 GMT

Coronavirus Updates in  Telangana: తెలంగాణ లో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,213 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,570కి చేరింది. ఇందులో 9, 226 యాక్టివ్ కేసులు ఉండగా, 9,069మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఈ రోజు 987 మంది డిశ్చార్జ్ కాగా, ఎనమిది మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన 1,213 కేసులలో ఒక్క GHMC పరిధిలోనే 998 కేసులు నమోదు అయ్యాయి. ఇక మిగతా ప్రాంతాలలో చూసుకుంటే రంగారెడ్డిలో 48, మేడ్చెల్ 54, సంగారేడ్డి, మహబూబ్ నగర్ , భద్రాది కొట్టేగుడెం లలో చెరో 7 , కరీంనగర్, మహుబుబాబాద్ , నిజామాబాదు లలో చెరో 5, సూర్యాపేట లో 4, ఖమ్మం 18, నల్గొండ 8, కామారెడ్డి 2, ములుగు 4, వరంగల్ రూరల్ 10, జగిత్యాల్, నిర్మల్ లలో చెరో 4, వరంగల్ అర్బన్ 09, నారాయణపేట 2, సిరిసిల్లా 06, నాగూర్ కర్నూల్, సిద్దిపేట, వికారాబాద్, గద్వాల్, మెదక్, యదాద్రిలో ఒక్కో కేసు నమోదు అయింది.

ఇక ఇందులో ఒక్క GHMC పరిధిలోనే కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది..తాజాగా తెలంగాణ ప్రభుత్వం కంటోన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది..

ఇక భారత్ లో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి.. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,148 కేసులు నమోదు కాగా, 434 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 6,04,641 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,26,947 ఉండగా, 3,59,859 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 17,834 మంది కరోనా వ్యాధితో మరణించారు. 



 


Tags:    

Similar News