తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా కేసులు

coronavirus Update In Telangana : తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1554 కరోనా కేసులు నమోదు అయ్యాయి..

Update: 2020-10-16 03:37 GMT

Coronavirus Update In Telangana : తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1554 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. ఇక తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,19,224కి చేరుకుంది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 23,౨౦౩ ఉండగా, కరోనా నుంచి 1,94,653 మంది కోలుకున్నారు. ఇక గత 24 గంటల్లో మరో 7 మంది కరోనాతో మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 1,256కి చేరుకుంది. ఇక నిన్న రాష్ట్రవ్యాప్తంగా 43,916 కరోనా టెస్టులు నిర్వహించారు. దీనితో ఈ సంఖ్య 37,46,963కి చేరుకుంది.

ఇక జిల్లాల వారిగా చూసుకుంటే అత్యధికంగా GHMC పరిధిలో 249 కరోనా కేసులు వచ్చాయి. ఇక అదిలాబాదు 23, భద్రాది కొత్తగూడెం 95, జగిత్యాల్ 32, జనగాం 22, భుపాలపల్లి 15, గద్వాల్ 19, కామారెడ్డి 33, కరీంనగర్ 84, ఖమ్మం 88, నల్గొండ 79, రంగారెడ్డి 129, సిద్ధిపేట 49, సూర్యాపేట 42, వరంగల్ అర్బన్ 53, మేడ్చెల్ 118, పెద్దపెల్లి 29, సిరిసిల్లా 28, మహబూబ్ నగర్ 21, మంచిర్యాల్ 27, సంగారెడ్డి 37, వికారాబాద్ 27, వనపర్తి 28, వరంగల్ రూరల్ 30, భువనగిరి 24 కేసులు నమోదు అయ్యాయి! 

Tags:    

Similar News