Coronavirus In Sewage Water: షాకింగ్ న్యూస్‌.. మురుగు నీటిలోనూ కరోనా.. హైదరాబాద్‌లో 6 లక్షల మందికి వైరస్!

Coronavirus In Sewage Water: కరోనా మ‌హ‌మ్మ‌రి ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుతలం చేస్తున్నది. దీని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు అనుక్ష‌ణం ప‌రిశోధ‌న‌లు చేస్తునే ఉన్నారు.

Update: 2020-08-19 18:41 GMT
ccmb hyderabad

Coronavirus In Sewage Water: కరోనా మ‌హ‌మ్మ‌రి ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుతలం చేస్తున్నది. దీని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు అనుక్ష‌ణం ప‌రిశోధ‌న‌లు చేస్తునే ఉన్నారు. ఈ పరిశోధన‌ల్లో రోజురోజుకు  కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. కానీ తాజాగా వెలుగులోకి వ‌చ్చిన విష‌యం మాత్రం వింటే నిజంగా దిమ్మతిర‌గ‌డం ఖాయం. ఇప్పటి వరకూ కరోనా వైరస్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా ఇతరులకు  వ్యాపిస్తుంద‌ని తెలుసు. దీంతో కరోనా వైరస్ రోగి వాడిన వస్తువులు వాడడం లేదా తాకిన చోట తాకితే వైరస్ సంక్రమిస్తుందని.. భ‌య‌ట‌ దేన్ని ముట్టుకోవాల‌న్నా, ఏం తినాల‌న్నా వ‌ణికిపోయేవాళ్లు.  తాజాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర్ ప్ర‌జ‌ల‌కు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మ‌రో చేదు వార్త తెలిపింది. త‌మ ప‌రిశోధ‌న‌ల్లో మురుగునీటిలో కరోనా ఆన‌వాళ్లు ఉన్నాయని తాము గుర్తించినట్లు సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్త పరిశోధనల్లో తేల్చారు. మలమూత్ర  విసర్జన ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని , న‌గ‌రంలోని మురుగు నీటి యంత్రాల నుండి సేక‌రించిన నీటిలో క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించామ‌ని సీసీఎంబీ రాకేష్ మిశ్రా అన్నారు.

క‌రోనా సోకిన వ్యక్తిలో దాదాపు 35 రోజుల వ‌ర‌కు వైర‌స్ ఉండే అవ‌కాశం ఉంద‌ని, మ‌ల మూత్ర విసర్జ‌న ద్వారా మురుగునీటిలో క‌రోనా వైర‌స్  వ్యాపించవచ్చునని  మిశ్రా తెలిపారు. హైదరాబాద్‌లో దాదాపు 2 లక్షల మంది విసర్జితాలలో వైరస్ విడుదలైనట్లు .. మరోవైపు, హైదరాబాద్ నగరంలో దాదాపు 6 లక్షల మంది కరోనా బారినపడినట్టు సీసీఎంబీ - సీఎస్‌ఐఆర్‌ సంయుక్త అధ్యయనంలో తేలింది. అయితే వీరిలో ఎక్కువ మందిలో కరోనా లక్షణాలు లేవని.. వారు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. ఇన్నాళ్లు కేవ‌లం ద‌గ్గు, తుమ్ములు, తుంప‌ర్ల ద్వారానే క‌రోనా వ్యాపిస్తుంద‌ని తేల‌గా ఇప్పుడు మ‌ల, మూత్ర విస‌ర్జ‌న ద్వారా కూడా వ‌స్తుంద‌ని సీసీఎంబీ షాకింగ్ న్యూస్ వెల్ల‌డించింది.

Tags:    

Similar News