నాకు కరోనా నిర్ధారణ అయింది : గాయని సునీత

Singer Sunitha tests positive for coronavirus: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు...
Singer Sunitha tests positive for coronavirus: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా ప్రముఖ సింగర్ సునీత తనకు కరోనా నిర్ధారణ అయినట్టు వీడియో సందేశంలో తెలిపింది. అంతేకాదు ఓ ప్రోగ్రామ్ కోసం వెళినపుడు ఒంట్లో బాగలేకపోవడంతో టెస్ట్ చేయించుకున్నట్టు తెలిపింది. ఆ టెస్టులో తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సునీత తెలిపారు.
అప్పటి నుంచి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ హోం ఐసోలేషన్‌లో ఉండి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. మహమ్మారితో పోరాటం అంత సులువేమీ కాదని.. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. తనకు గత రెండు మూడు రోజులుగా తనకు మిత్రులు, బంధువులు, మీడియా వాళ్ల నుంచి తన ఆరోగ్యం గురించి ఆరా తీసారు. అంతేకాదు తన హెల్త్ విషయమై తనకు ఫోన్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులందరు ఎస్పీ బాలు గారు కరోనా నుంచి కోలుకోని పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు తెలిపింది.