Hyderabad: రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ చర్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది.
Hyderabad: హైదరాబాద్ చర్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చర్లపల్లి-ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి సెక్షన్ పరిధిలో కిలోమీటర్ నంబర్ 206 బై 48 దగ్గర రైల్వే పట్టాలపై మృతదేహాలు ఉన్నట్టు.. గూడ్స్ రైలు లోకో పైలట్.. వాకీటాకీ ద్వారా చర్లపల్లి రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించాడు.
దీంతో.. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీస్ సిబ్బంది.. మృతదేహాలను గుర్తించారు. మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి, విజయ, చేతన రెడ్డిగా గుర్తించారు. మృతుల దగ్గర ఎలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లభించలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.