Coronavirus updates in AndhraPradesh: ఏపీలో కొత్తగా 9,742 కరోనా కేసులు

Coronavirus updates in AndhraPradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కు చేరింది

Karampoori Rajesh
Published on: 19 Aug 2020 10:52 PM IST
Coronavirus updates in AndhraPradesh: ఏపీలో కొత్తగా 9,742 కరోనా కేసులు
X
Coronavirus updates in AndhraPradesh

Coronavirus updates in AndhraPradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,003కు చేరింది. ఇందులో 86,725 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,26,372 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో మృతుల సంఖ్య 2906కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 8061 మంది కరోనాను జయించారని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఏపీలో కోవిడ్‌-19 టెస్టులు 30లక్షలు దాటాయి.

ఇక జిల్లాల వారీగా ప‌రిశీలిస్తే.. అనంతపురంలో 1123, చిత్తూరులో 830, తూర్పు గోదావరిలో 1399, గుంటూరులో 555, కడపలో 673, కృష్ణాలో 281, కర్నూలులో 794, నెల్లూరులో 755, ప్రకాశంలో 585, శ్రీకాకుళంలో 565, విశాఖలో 835, విజయనగరంలో 428, పశ్చిమ గోదావరిలో 919 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి.




Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story