గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై కరోనా బాధితుడు దాడి

తెలంగాణలో తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య ఏడుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 97 కేసులు నమోదవగా.. 77 యాక్టివ్ కేసులున్నాయి.

Update: 2020-04-01 16:20 GMT

తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య ఏడుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 97 కేసులు నమోదవగా.. 77 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా గురువారం గాంధీ ఆస్పత్రిలో మరో కోవిడ్ బాధితుడు మరణించాడు. పరిస్థితి విషమించడంతోనే మృతి చెందినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. అయితే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు డాక్టర్లపై దాడి చేశారని వెల్లడించారు. సోదరుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆగ్రహంతో వైద్యులపై దాడి చేసినట్లు తెలిపాడు. కరోనా రోగులకు పెద్దమనసుతో వైద్యం చేస్తున్న డాక్టర్ల పట్ల ఇలా వ్యవహరించడం శ్రవణ్ సరికాదన్నారు. ఈ ఘటనపై పోలీసులతో పాటు వైద్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

ఈ విషయం తెలుసుకున్నాక సీపీ అంజనీకుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై మంత్రి ఈటల రాజేంద్ర ఆరా తీశారు. డాక్టర్లపై దాడిని మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి వైద్యులకు విజ్ఞప్తి చేశారు. వైద్యులపై దాడి చేసిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రి నుంచి చెస్ట్ ఆస్పత్రికి షిప్ట్ చేశారు. మృతి చెందిన అతని సోదరుడిని బంధువులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు. దాడి చేసిన వ్యక్తి అతడి సోదరుడు ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరయ్యారని అధికారులు ధృవీకరించారు.

Tags:    

Similar News