Corona Virus New Strain : కొత్త వైరస్‎పై తెలంగాణ మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు

కరోనా సెకండ్ వేవ్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Update: 2020-12-26 12:30 GMT

ఇప్పటికే చైనాలో పుట్టిన కోవిడ్‌-19తో జనం అలకల్లోలం అవుతుంటే.. ఇప్పుడు కొత్త వైరస్‌ కంగారుపెడుతోంది. అంతేకాదు.. కరోనా మహమ్మారి రూపాంతరం చెంది కల్లోలం సృష్టిస్తోందోనన్న గుబులు రేగుతోంది. ఇంగ్లాండ్‌లో కరోనా వేరియంట్‌ శరవేగంగా విస్తరిస్తూ.. మరణమృదంగం మోగిస్తోంది. ఈ కొత్త వైరస్‌ ప్రపంచమంతా డేంజర్‌ బెల్‌ మోగించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే WHO కొత్త వైరస్‌పై చర్చించి.. ప్రపంచదేశాలను మరోసారి హెచ్చరించింది. అయితే అప్పటికే పలు దేశాల్లో బ్రిటన్‌ వైరస్‌ పాగా వేసింది. ఇక లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత యూకే నుండి భారత్‌కు రాకపోకలు పెరిగాయి. దీంతో ఓవైపు వ్యాక్సిన్‌ ఉందని ఒకింత ఉపశమనం కలిగిస్తున్నా.. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల భారత్‌లోనూ బ్రిటన్‌ వైరస్‌ డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది.

దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఈ వైరస్‌ జాడలు కనిపిస్తున్నాయి. కొందరికి పాజిటివ్‌ రావడంతో మరింత అలెర్ట్‌ అయ్యారు అధికారులు. దీంతో రాష్ట్రాలకు కేంద్రం గైడ్‌లెన్స్‌ జారీ చేసింది. స్ట్రెయిన్‌ పట్ల మునుపటికన్నా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలోనూ ఈ కొత్త వైరస్ కలకలం రేపుతోంది. యూకే నుంచి వచ్చిన కొందరికి కరోనా రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. వారందరినీ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించింది. ఐతే అది కొత్త వైరసా? కదా? అనేది తేలాల్సి ఉంది. పుణె వైరాలజీ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తేనే మరింత స్పష్టత వస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి మొదట వచ్చిన కరోనాతో ప్రమాదమేమి లేదని పేర్కొన్నారు. కానీ కొత్తరకం స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఈటల స్పష్టం చేశారు. ఇతర దేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేయగా.. కొందరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. కొత్త స్ట్రెయిన్ కరోనా లేక పాత కరోనా అన్నది ఇంకా నిర్దారణ కావడానికి కొంత సమయం పడుతుందని మంత్రి ఈటల రాజేంద్ర వెల్లడించారు.



Tags:    

Similar News