Corona Vaccine Clinical Trails: నిమ్స్ లో విజయవంతమైన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్..

Corona Vaccine Clinical Trails నిమ్స్‌లో జరుగుతున్న మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

Update: 2020-08-02 01:30 GMT
Coronavirus Vaccine Clinical Trails

Corona Vaccine Clinical Trails నిమ్స్‌లో జరుగుతున్న మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. వారం రోజుల్లో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు. మొదటి దశలో 50మందికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామన్నారు. క్లినికల్ ట్రయల్స్ ప్రయోగించిన వ్యక్తులు చాలా ఆరోగ్యంగా ఉన్నారన్నారు.

కరోనా వైరస్ నుంచి కోలుకోవటం అనేది ఆయా వ్యక్తుల యొక్క ఇమ్యూనిటీని బట్టి ఉంటోందన్నారు. ఐసీఎంఆర్ ఉత్తర్వుల మేరకు నిమ్స్ నుంచి వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా కోవిడ్‌ను కట్టడి చేయటం సులభమవుతోందన్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయటానికి ముందుకురావాలని డాక్టర్ శ్రీనివాస్ కోరారు. ఇదిలా ఉండగా వివిధ దేశాల్లో సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ ఏ స్థితిలో ఉన్నాయో ఒక్కసారి తెలుసుకోవచ్చు.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఓ వైపు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ టీకాను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో తామే ముందున్నామంటే.. తామే ముందున్నామంటూ కొన్ని దేశాలు ఎప్పటికప్పుడు ప్రకటనలు సైతం గుప్పిస్తున్నాయి. ఇంతకీ వ్యాక్సిన్ తయారీలో ఏ దేశం ముందుంది ? ఏయే దేశాల్లో మానవులపై వ్యాక్సిన్ ప్రయోగాలు ( Human trials ) ఏ దశలో ఉన్నాయనే వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

అమెరికాలో కోవిడ్-19 వ్యాక్సిన్ ( COVID-19 vaccine in US ):

అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో ముందున్నామని చెబుతున్న మొడర్నా బయోటెక్ సంస్థ... జూలై 27 నుంచి తుది దశ ప్రయోగాల్లో బిజీ అవుతామని పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన ప్రయోగాల ఫలితాలను తాజాగా ఓ జర్నల్‌కి వెల్లడించిన మొడర్నా... 3వ దశ ప్రయోగాల కోసం 30,000 మందిని నియమించుకుంటున్నట్టు తెలిపింది.

ఇండియాలో కొవాక్సిన్ పరిస్థితేంటి ? ( Covaxin trials in India ):

ఇండియాలో కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌లో దూసుకుపోతున్న భారత్ బయోటెక్.. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ షురూ చేసింది. ఐసిఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ( NIV ) సహకారంతో హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాక్సిన్ వ్యాక్సిన్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

భారత్ బయోటెక్‌తో ( Bharat Biotech ) పాటు జైడస్ క్యడిలా ( Zydus Cadila ) కూడా కరోనావైరస్కి వ్యాక్సిన్‌ని కనిపెట్టే పనిలో బిజీగా ఉంది. ఇటీవలే ప్రీ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ సంస్థ.. తాజాగా హ్యూమన్ ట్రయల్స్‌కి కూడా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ( CDSCO ) నుంచి అనుమతి తీసుకుంది. ఇండియాలో కరోనా వ్యాక్సిన్‌ తయారీ రేసులో భారత్ బయోటెక్ తర్వాత రెండో స్థానంలో ఉన్న కంపెనీ కూడా ఇదే.

రష్యాలో వ్యాక్సిన్ తయారీ ( COVID-19 vaccine in Russia ):

రష్యాలో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో ఒకే ఒక సంస్ధ మున్ముందుకు దూసుకుపోతోంది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి జమలీ నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడిమాలజీ అండ్ మైక్రోబయాలజీ ( GNRCEM ) వాళ్లు తయారు చేస్తోన్న వ్యాక్సిన్ జూన్ 18నే తొలి దశ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించింది.

బ్రిటన్‌లో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ ( COVID-19 vaccine in Britain ):

బ్రిటన్‌లో యాంటీ కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీలో రెండు సంస్థలు ముందంజలో ఉన్నాయి. అందులో ఒకటి ఆస్ట్రాజెనికాతో ( AstraZeneca ) కలిసి ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ( Oxfor University ) వాళ్లు రూపొందిస్తున్న వ్యాక్సిన్ కాగా మరొకటి లండన్‌కి చెందిన ఇంపీరియల్ కాలేజ్ ( Imperial College London ) తయారు చేస్తోన్న వ్యాక్సిన్. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్‌లో 3వ దశలో ఉండగా ఇంపీరియల్ కాలేజీ వాళ్లు తయారు చేస్తోన్న వ్యాక్సిన్ 1,2వ ఫేజ్ ట్రయల్స్ జూన్ 15నే ప్రారంభమయ్యాయి.

చైనాలో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ ఏ దశలో ఉంది ( Chinese vaccines for COVID-19 ) ?

చైనాలో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ విషయానికొస్తే... చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ ( Sinovac Biotech ) అనే సంస్థ బ్రెజిల్‌లో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తోంది. 3వ దశ ట్రయల్స్ ప్రారంభిస్తున్న ఈ సంస్థ కూడా కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న సంస్థల్లో ఒకటిగా ఉంది. బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి కెన్సినో ( CanSino ) అనే బయోటెక్నాలజీ సంస్థ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ కూడా ప్రస్తుతం హ్యూమన్ ట్రయల్స్‌లో ఫేస్ 2లో ఉంది.

వుహాన్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి సినోఫార్మ్ సంస్థ తయారు చేస్తోన్న కరోనావైరస్ వ్యాక్సిన్ ( Sinopharm's COVID19 vaccine ) సైతం 2 దశలో ఉంది. ఇదే సినో‌ఫామ్ సంస్థ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రోడక్ట్స్ సంస్థతో కలిసి మరో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం దీని ట్రయల్స్ కూడా రెండో దశలోనే ఉన్నాయి.

Tags:    

Similar News