Siddipet: గజ్వేల్‌లో కల్తీ పెట్రోల్ కలకలం

Siddipet: పెట్రోల్‌కు బదులు నీళ్లు వస్తున్నాయని సిబ్బందితో వాగ్వాదం

Update: 2023-09-16 02:28 GMT

Siddipet: గజ్వేల్‌లో కల్తీ పెట్రోల్ కలకలం

Siddipet: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని కేజేవీ హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో కల్తీ పెట్రోల్ పోస్తున్నారని వాహనదారులు ఆందోళనకు దిగారు. తన బైక్‌లో పెట్రోల్ పోయించుకుని కొద్ది దూరం వెళ్లగానే వాహనం ఆగిపోయిందని కరుణాకర్ అనే వాహనదారుడు ఆరోపించాడు. పెట్రోల్ ట్యాంక్ తెరిచి చూసి ఓ బాటిల్‌లోకి పెట్రోల్ సేకరించినట్లు తెలిపాడు. పెట్రోల్ బదులుగా నీళ్లు వచ్చాయని పెట్రోల్ పంప్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. దీంతో బాధితుడు గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags:    

Similar News