Bhupalpally: విషాదం.. కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్ మృతి
Bhupalpally: రేపు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా.. గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఘటన
Bhupalpally: విషాదం.. కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్ మృతి
Bhupalpally: భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. అటవీప్రాంతంలో కానిస్టేబుల్ వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాడు. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన... విద్యుత్ తీగలు తగలడంతో గ్రౌహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ మృతి చెందాడు. రేపు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా.. గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.