Bhatti Vikramarka: బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్యే లోపాయికారి ఒప్పందం ఉంది
Bhatti Vikramarka: కాంగ్రెస్, బీజేపీలు భిన్న ధృవాలన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క.
Bhatti Vikramarka: బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్యే లోపాయికారి ఒప్పందం ఉంది
Bhatti Vikramarka: కాంగ్రెస్, బీజేపీలు భిన్న ధృవాలన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్ ఎందుకు పనిచేస్తుందని ప్రశ్నించారు ఆయన. హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్యే లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు భట్టి విక్రమార్క.
హుజురాబాద్ ప్రజలు టీఆర్ఎస్ ను ఓడించాలని చాలా స్పష్టంగా ఉన్నారని భట్టి జోస్యం చెప్పారు. ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడుగా వెంకట్ చాలా ఏళ్లుగా విద్యార్థి, యువత కోసం గట్టిగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి పోరాటాలు చేసే అభ్యర్థిని శాసనసభకు పంపించాలని హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.