తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. వరుసగా జాతీయ నేతలు పర్యటించేలా కార్యాచరణ

Congress: ఈనెల రెండో వారంలో రాహుల్ గాంధీ తెలంగాణ టూర్

Update: 2023-10-05 08:15 GMT

తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. వరుసగా జాతీయ నేతలు పర్యటించేలా కార్యాచరణ

Congress: తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. వరుసగా జాతీయ నేతలు పర్యటించేలా కార్యాచరణ రచిస్తున్నారు. ఈనెల రెండో వారంలో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు రోజులు తెలంగాణ పర్యటనలో ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రియాంక గాంధీ పర్యటన కూడా ఉండనున్నట్లు సమాచారం. నిజామాబాద్‌లో మహిళా డిక్లరేషన్ సభలో ప్రియాంకగాంధీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అగ్రనేతల పర్యటనలలోపు అభ్యర్థులను ప్రకటించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Tags:    

Similar News