Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం లాంఛనమే
*పోటీ చేయొద్దని నిర్ణయించుకున్న కాంగ్రెస్, బీజేపీ *ఇప్పటి వరకు దాఖలు కానీ ఇతరుల నామినేషన్లు
ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం లాంఛనమే(ఫైల్ ఫోటో)
Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం లాంఛనమేనని తెలుస్తోంది. పోటీ చేయవద్దని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటి వరకు ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.
అయితే సరైన బలం లేకపోవడం, గత ఎన్నికల్లో భారీ క్రాస్ ఓటింగ్ జరగడంతో పోటీ వద్దని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మూడు గంటల వరకే నామినేషన్ల దాఖలుకు తుది గడువు. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు కవిత.