Rajendranagar: రాజేంద్రనగర్ ఉద్యానవన కళాశాల విద్యార్థుల ఆందోళన
Rajendranagar: అధికారుల నియామకాలు చేపట్టాలని డిమాండ్
Rajendranagar: రాజేంద్రనగర్ ఉద్యానవన కళాశాల విద్యార్థుల ఆందోళన
Rajendranagar: రాజేంద్రనగర్ ఉద్యానవన కళాశాలలో విద్యార్ధుల ఆందోళన కొనసాగుతోంది. ఉద్యాన అధికారులు, ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తరగతులు బహిష్కరించి కళాశాల ముందు బైఠాయించారు. ఆడిటోరియంలో జరుగుతున్న కౌన్సిలింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండాగేట్లకు తాళాలు వేశారు. అయితే విద్యార్థులు గేట్లను తోసుకుని వచ్చి ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.