Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

* ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. చలి తీవ్రత పెరిగే అవకాశం

Update: 2022-11-20 03:57 GMT

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

Cold In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటిపూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం చూపెడుతుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని వికారాబాద్, కొమురంభీమ్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వికారాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.

కొమురంభీమ్ జిల్లాలోని సిర్పూర్(యు)లో 9.8 డిగ్రీలు, నేరడిగొండలో 10.1 డిగ్రీలు, బేలలో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక నిర్మల్ జిల్లా తాండ్రలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరోవైపు ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. సింగిల్ డిజిట్ దిశగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం మరింతగా పెరగనుందని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇక ఈ ఏడాది చలికాలంలో రికార్డుస్థాయిలో లో- టెంపరేచర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. వృద్ధులు పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు మార్నింగ్ వాక్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న పిల్లలకు చలిగాలులు తగలకుండా చూసుకోవాలని చెబుతున్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 

Tags:    

Similar News