Harish Rao: మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువగా ఉంది
Harish Rao: ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలపడం ప్రతిపక్ష సభ్యుల హక్కు అని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
Harish Rao: ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన తెలపడం ప్రతిపక్ష సభ్యుల హక్కు అని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సభలో సభ్యులకు సమాన హక్కులుంటాయని... సభాపతి హక్కులు కాపాడాలని కోరారు. ఏడు రోజులు సభ నిర్వహణపై బీఏసీలో చర్చకు రాలేదని చెప్పారు. సభలో చర్చించే అంశాలను 24 గంటల ముందు పంపాలని సూచించారు. నిరసనలు తెలిపేందుకు మైకు ఇవ్వకపోవడం ప్రతిపక్షం గొంతు నొక్కడమేనని అన్నారు. మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువగా ఉందని... ఆయన మాటల కంపు వినడం ఎక్కువ కష్టంగా ఉందన్నారు. అయితే ముఖ‌్యమంత్రి వ్యాఖ్యలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వనందుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.