Revanth Reddy: గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్ సమీక్ష
Revanth Reddy: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తాం
Revanth Reddy
Revanth Reddy: గణేష్ ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో పలువురు మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని సూచించారు సీఎం. నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు సీఎం రేవంత్. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎం.