కేసీఆర్ చేసిన అప్పుకు ఒక్క ఏడాదిలోనే ఎంత అసలు, ఎంత వడ్డీ కట్టామో తెలుసా?

Update: 2025-03-16 16:19 GMT

కేసీఆర్ చేసిన అప్పుకు ఒక్క ఏడాదిలోనే ఎంత అసలు, ఎంత వడ్డీ కట్టామో తెలుసా?

CM Revanth Reddy's speech in Warangal meetig : వరంగల్‌కు ఎయిర్ పోర్ట్ తీసుకొస్తానని లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో మాటిచ్చాను. అప్పుడు మాటిచ్చినట్లుగానే ఇప్పుడు వరంగల్ ఎయిర్ పోర్టు‌తో మీ ముందుకొచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే వరంగల్‌కు ఎయిర్ పోర్ట్ రింగ్ రోడ్డు వచ్చిందన్నారు. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పారు.

ఆదివారం స్టేషన్ ఘణపూర్‌లో రూ. 800 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు పలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మార్పు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణకు కడియం శ్రీహరి సేవలు అవసరం ఉన్నాయనే ఉద్దేశంతోనే ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నట్లు చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇబ్బందులు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అప్పులతో రాష్ట్రం అప్పుల ఊబీలో కూరుకుపోయిందన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన రూ.8.29 లక్షల కోట్ల అప్పును మా ప్రభుత్వం నెత్తిన పెట్టారు. ఆ అప్పును తీర్చడం కోసం ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం 84 వేల కోట్లు వడ్డీల కింద, మరో 64 వేల కోట్లు అసలు కింద చెల్లించాల్సి వచ్చిందన్నారు.

ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తూనే మరోవైపు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు నెరవేర్చిన హామీలను, ఈ ఏడాది కాలంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాల వెల్లడిని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.  

Full View

Tags:    

Similar News