Delimitation issue: స్టాలిన్ ఆహ్వానంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
CM Revanth Reddy about Stalin's invitation: డీలిమిటేషన్ పేరుతో బీజేపి దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతోందని రేవంత్ రెడ్డి...
Delimitation issue: స్టాలిన్ ఆహ్వానంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
Revanth Reddy about MK Stalin's invitation: డీలిమిటేషన్ వివాదంపై చర్చించేందుకు చెన్నైలో మార్చి 22న జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఈ జేఏసి సమావేశానికి రావాల్సిందిగా తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు డిఎంకే నేతల బృందాన్ని పంపించారు. అందులో భాగంగానే డిఎంకే నేతలు కనిమొళి, ఎన్.ఆర్. ఇలాంగో, కె.ఎన్. నెహ్రూలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
డీలిమిటేషన్ పేరుతో కేంద్రంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతున్నాయని రేవంత్ అన్నారు. ఇది డీలిమిటేషన్ కాదు.... దక్షిణాది రాష్ట్రాలకు పరిమితి విధించడం అవుతుందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణ రాష్ట్రాల నుండే కేంద్రానికి ఆదాయ పన్ను రూపంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. అంతేకాకుండా దక్షిణాది నుండే ఎక్కువ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ బీజేపి దక్షిణాది రాష్ట్రాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు బీజేని తిరస్కరించడాన్ని జీర్ణించుకోలేకనే ఆ పార్టీ ఇలా చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపి అధికారంలో లేదు. కర్ణాటకలోనూ బీజేపికి అధికారంలో పోయింది. అందుకే బీజేపి దక్షిణాదిపై పగ సాధిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదేమైనా డీలిమిటేషన్ విషయంలో బీజేపి కుట్రలను సాగనిచ్చే ప్రసక్తే లేదని అన్నారు.
స్టాలిన్ ఆహ్వానం విషయానికొస్తే...
ఇక స్టాలిన్ ఆహ్వానం విషయానికొస్తే... సిద్ధాంతాల పరంగా స్టాలిన్ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఏకీభవిస్తోందని అన్నారు. అయితే, ఈ భేటీకి వెళ్లాలా లేదా అనేది తను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ను అడిగి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని రేవంత్ రెడ్డి మీడియాకు చెప్పారు.
కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందించే అవకాశం ఉంది?
డిఎంకే పార్టీ కేంద్రంలో ప్రతిపక్షమైన ఇండియా బ్లాక్ కూటమిలో కొనసాగుతోంది. కేంద్రానికి వ్యతిరేక పోరాటంలో అనేక విషయాల్లో రెండు పార్టీల వైఖరి ఉంటుంది. డీలిమిటేషన్‌పై కూడా రెండు పార్టీల ఎజెండా కూడా ఒక్కటే. అందుకే స్టాలిన్ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లేదంటే ఇండియా బ్లాక్‌లో బేధాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాదిన తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా అది తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కూడా వర్తించే అవకాశం ఉంది.
Delimitation Explainer: డీలిమిటేషన్‌తో ఎవరికి ఎక్కువ లాభం? ఎవరికి ఎక్కువ నష్టం?