Revanth Reddy: హైదరాబాద్ డ్రగ్స్ గేట్ వేగా మారింది.. డ్రగ్స్, గంజాయి బ్యాచ్ ను వదలం
Revanth Reddy: తెలంగాణను పట్టిపీడిస్తున్న మత్తు మాఫియాను తరిమికొడుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Revanth Reddy: తెలంగాణను పట్టిపీడిస్తున్న మత్తు మాఫియాను తరిమికొడుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగరాల్లోనే కాదు.. పట్టణాలు. గ్రామాల్లో గంజాయి విస్తరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అండగా నిలబడితే మత్తు మాఫియాను తరిమికొడుతామన్నారు. గతంలో కొందరు హైదరాబాద్ ను గేట్ వే ఆఫ్ డ్రగ్స్ గా మార్చారని మండిపడ్డారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నా వారిని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు.
కృష్ణా జలాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 209 టీఎంసీల కృష్ణా నీటి కోసం చేస్తున్న న్యాయపోరాటంలో ట్రిబ్యునల్ వద్ద తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్నామని చెప్పారు. కృష్ణా జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. SLBC టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొంటామన్నారు.