Revanth Reddy: ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. ఇకపై రాజకీయం చూపిస్తా
Revanth Reddy: చేరికలపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Revanth Reddy: ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. ఇకపై రాజకీయం చూపిస్తా
Revanth Reddy: ఇప్పటి వరకు ఒక లెక్క..ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎన్నికల నగారా మోగడంతో.. పొలిటికల్ గేర్ ఛేంజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే చేరికలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారాయన. విపక్షాలు పదే పదే ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటే చూస్తూ ఊరుకోవాలా..? ఈ రోజు నుంచి తన అసలు సిసలు రాజకీయం చూపిస్తామని ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచేశారు...
ఇక సీఎం రేవంత్ కామెంట్స్ కు మరింత బలం చేకూరేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన హస్తం పార్టీ..పలువురు నేతలను జాయిన్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.