CM KCR: దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు.. ప్రభుత్వ షరతులు ఒప్పుకుంటేనే పోడు భూములు పంపిణీ..

CM KCR: తెలంగాణలో పదకొండున్నర లక్షల ఎకరాల్లో పోడు భూములు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

Update: 2023-02-10 06:30 GMT

CM KCR: దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు.. ప్రభుత్వ షరతులు ఒప్పుకుంటేనే పోడు భూములు పంపిణీ..

CM KCR: తెలంగాణలో పదకొండున్నర లక్షల ఎకరాల్లో పోడు భూములు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే ప్రస్తుతం పోడు భూముల వ్యవహారంలో అనేక అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని..అది మంచి పద్దతి కాదని తెలిపారు. ఇకనుంచి అటవీ భూముల్లో నరికివేత ఉండదని గ్రామ సర్పంచ్ సహా గ్రామంలోని అఖిలపక్షాలు అన్నీ సంతకాలు చేసిన తర్వాత పోడు పట్టాలను పంపిణీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. అప్పటివరకు పోడు భూములను సాగుచేసుకునే వారికి పట్టాలను పంపిణీ చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

తెలంగాణలో పోడుభూముల సమస్యను వీలైనంత త్వరంగా పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో దళితబంధు తరహాలోనే గిరిజన బంధు కూడా ఇస్తామని కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్..రాష్ట్రంలో ప్రజలందరూ సమానమేనని..అలాంటి భేషజాలు ప్రభుత్వానికి లేదన్నారు. 

Tags:    

Similar News