MLC Kavitha: సీఎం కేసీఆర్ సింగరేణి పక్షపాతి
MLC Kavitha: సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థకి ప్రక్షపాతి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించి నిర్వీర్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు పంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యధిక బోనస్‌ను ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.