Telangana Assembly: ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
Telangana Assembly: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.
Telangana Assembly: ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
Telangana Assembly: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని అసెంబ్లీలో తెలిపారు కేసీఆర్. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఉంటుందని వెల్లడించారు.
దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని తెలిపారు. కొత్త జిల్లాల ప్రకారం నవోదయ పాఠశాలలు అడిగితే కేంద్రం ఇవ్వట్లేదు. బీజేపీ ఎంపీలు నవోదయ పాఠశాలలు మంజూరు చేయించాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.