CM KCR Press Meet: మ.2.30కు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం
CM KCR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ
CM KCR Press Meet: మ.2.30కు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం
CM KCR Press Meet: కాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కానుంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది.119 నియోజకవర్గాలకు గాను 87 నుంచి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టేందుకు... గులాబీ దళపతి వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది గులాబీదళం. ఎన్నికలు నవంబర్ లో జరుగుతాయని అంచనా వేస్తున్న కేసీఆర్.. దాదాపు మూడు నెలల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.