Telangana: తెలం‌గాణ న్యాయ చరిత్రలో సరి‌కొత్త శకం

Telangana: తెలం‌గాణ న్యాయ చరిత్రలో సరి‌కొత్త శకం ప్రారంభం కాను‌న్నది.

Update: 2022-06-02 09:05 GMT

Telangana: తెలం‌గాణ న్యాయ చరిత్రలో సరి‌కొత్త శకం 

Telangana: తెలం‌గాణ న్యాయ చరిత్రలో సరి‌కొత్త శకం ప్రారంభం కాను‌న్నది. రాష్ట్రం‌లోని కొత్త జిల్లాల్లో ఒకే‌సారి 23 జిల్లా కోర్టులు ప్రారంభం కాను‌న్నాయి. హైకోర్టు ఆవ‌ర‌ణలో జరు‌గ‌నున్న కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సీఎం కేసీ‌ఆర్‌ సంయు‌క్తంగా కొత్త జిల్లాల కోర్టు‌లను ప్రారం‌భించ‌ను‌న్నారు. స్వరాష్ట్ర ఆవి‌ర్భావం నాటికి తెలం‌గా‌ణ‌లోని ఉమ్మడి జిల్లాల్లో 10 జిల్లా కోర్టులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత పరి‌పా‌లనా సంస్కర‌ణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైద‌రా‌బాద్‌ మినహా మిగి‌లిన ఉమ్మడి జిల్లా‌లను 33 జిల్లా‌లుగా పున‌ర్వి‌భ‌జించింది. తద‌ను‌గు‌ణంగా సీఎం కేసీ‌ఆర్‌ విజ్ఞప్తి మేరకు కొత్త జిల్లాల్లో 23 జిల్లా కోర్టుల ఏర్పా‌టుకు హైకోర్టు అను‌మ‌తిం‌చింది. ఈ జ్యుడి‌షి‌యల్‌ జిల్లా‌లను, వాటి పరి‌ధిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో‌లు జారీ చేసింది.

Tags:    

Similar News