హైదరాబాదులో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీ వర్ష సూచన

హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు తీవ్ర ఎండలు, ఉక్కపోతతో, మరోవైపు కరోనా వైరస్ కేసులతో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.

Update: 2020-03-28 04:16 GMT

హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు తీవ్ర ఎండలు, ఉక్కపోతతో, మరోవైపు కరోనా వైరస్ కేసులతో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.శనివారం (మార్చి 28) నుంచి మూడు రోజుల పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ఏర్పడిన ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

కాగా..హైదరాబాద్ లో పగటి పూట ఎండలు దంచికొడుతున్నాయి. గ్రేటర్ పరిధిలో శుక్రవారం తొలిసారిగా రికార్డు స్థాయిలో 37 డిగ్రీలగరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగాయి. గాలిలో తేమ 34 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వర్ష సూచన కాస్త ఊరటనిచ్చే వార్తే. అయితే. వర్షాల కారణంగా తెలంగాణలోని ప్రాంతాల్లో మిరప, మొక్కజొన్న, మామిడి, వరి, పలు రకాల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News