Central Team Visit Gandhi Hospital: తెలంగాణలో కేంద్ర బృందం పర్యటనలో మార్పులు

Central Team Visit Gandhi Hospital: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో జీజీహెచ్ మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంది.

Update: 2020-06-29 03:12 GMT

Central Team Visit Gandhi Hospital: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో జీజీహెచ్ మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుంది. అడుగు బయట పెట్టలంటేనే ప్రజలు జంకుతున్నారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర పర్యవేక్షక బృందం ఆదివారం నగరానికి చేరుకుంది. ఇవాళ గాంధీ ఆసుపత్రిని సందర్శించనుంది. కరోనా కేసులు జీజీహెచ్ పరిధిలో ఎందుకిలా జరుగుతోందని ప్రధానంగా ఆరా తీయనున్నట్లు సమాచారం.

కొవిడ్‌-19 నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు అందుతున్న వైద్యం, సదుపాయాలు, ఆసుపత్రిలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది పనితీరు పలు అంశాలపై క్షుణ్ణంగా ఈ బృందం పరిశీలించనున్నట్లు తెలిసింది. కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించడం ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి పాలనా యంత్రాంగం హుటాహుటిన సమావేశమై పలు అంశాలపై చర్చించి... లోటుపాట్లను సరిచేసే పనులను చేపట్టినట్లు తెలుస్తుంది.

కేంద్ర బృందం పర్యటన వివరాలు:

* కేంద్ర బృందం మొదట 9.30కి గచ్చిబౌలికి వెళ్లి టీమ్స్ ఆసుపత్రినీ పరిశీలించనుంది.

* 11.30కి గాంధీ హాస్పిటల్ పరిశీలన. గాంధీ హాస్పిటల్ లో రోగులకు అందుతున్న వైద్యం, వారికి సమకూర్చిన సదుపాయాలు, ఆసుపత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది పనితీరు పరిశీలించనుంది.

* 12.30 కి కంటైన్ మెంట్ దోమలగూడా దోబీ గల్లీలో పర్యటన

* హిమాయత్ నగర్ లో వినయ్ బాబు ఇంటికి వెళ్లనున్న బృందం.

* 2 గంటలకు బీఅర్కే భవన్ లో లంచ్.

* సాయంత్రం 4.30 వరకు అధికారుల తో భేటీ.

రాష్ట్రంలో కరోనా కట్టడి కి తీసుకుంటున్న చర్యలపై CS సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతా కుమారి కేంద్ర బృందంకు వివరించనున్నారు.PPE కిట్ లపై వివరించనున్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ వివరిస్తారు. Ghmc లో కరోనా పరిస్థితులపై ghmc కమిషనర్ లోకేష్ కుమార్ కేంద్ర బృందానికి వివరణ .. తరువాత కేంద్ర బృందం దిశా నిర్దేశం చేయనుంది.

ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 983 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 14,419 కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9000 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి 5172 మంది కోలుకున్నారు. 244 మంది డిశ్చార్జ్ కాగా, నలుగురు మృతి చెందారు.

ఒక్క GHMC పరిధిలోనే 816 కేసులు ఉన్నాయి. ఇక ఇందులో ఒక్క GHMC పరిధిలోనే కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో గ్రేటర్ హైదరాబాద్ లో మరో 15 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు హైదరాబాద్ లో 15 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని నివేదించారు. ఈ మేరకు కేసిఆర్ సానుకూలంగా స్పందించారు.

ఇక రంగారెడ్డిలో 47, మేడ్చెల్ లో 29, నల్గొండలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 05, కరీంనగర్, సిద్దిపేట లో 03, వరంగల్ (అర్బన్ ) లో 12, ఆదిలాబాద్ లో 02, ఖమ్మంలో 03, మంచిర్యాల్ లో 33, వరంగల్ (రూరల్ ) లో 19, గద్వాల్ లో 02, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జనగాంలో ఒక్కో కేసు నమోదు అయింది.


Tags:    

Similar News