Lockdown Extension in Hyderabad: హైదరాబాద్‌లో మరో 15 రోజులు లాక్‌డౌన్..?త్వరలోనే కేసీఆర్ నిర్ణయం!

Lockdown Extension in Hyderabad: హైదరాబాద్‌లో మరో 15 రోజులు లాక్‌డౌన్..?త్వరలోనే కేసీఆర్ నిర్ణయం!
x
KCR (File Photo)
Highlights

Lockdown Extension in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు రెట్టింపు అవుతున్నసంగతి తెలిసిందే.

Lockdown Extension in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు రెట్టింపు అవుతున్నసంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువగా కేసులు నమోదవున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు చికిత్స అందిస్తోన్న తీరు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో సమాలోచనలు జరిపారు. కాగా కొంత మంది అధికారులు సమావేశంలో సీఎం కేసీఆర్ కు హైదరాబాద్ లో 15 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని నివేదించారు. దీంతో సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించేందుకు విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరో 3-4 రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి అనుసరించిన వ్యూహాలను ఖరారు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసులను చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి వేగంగా ఉందని, అదే విధంగా తెలంగాణలోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని సీఎంకు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లతోపాటు ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లోనూ వేలాది బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు.

వ్యాధి లక్షణాలు లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ గా తేలిన వారికి తగు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో కూడా తెలంగాణలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని ఈటల వెల్లడించారు. కోవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది కేవలం 1.52 మాత్రమే అని ఆమె వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories