ఎంపీ రఘురామపై కేసు నమోదు
Raghu Rama Krishna Raju: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదైంది.
ఎంపీ రఘురామపై కేసు నమోదు
Raghu Rama Krishna Raju: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదైంది. సైబరాబాద్ కమిషనరేట్‌లో కేసు నమోదు చేశారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఏ1గా రఘురామ, ఏ2 భరత్, ఏ3 సీఆర్‌పీఎఫ్ ఏఎస్సై, ఏ4 కానిస్టేబుల్ సందీప్, ఏ5 పీఏ శాస్త్రిని చేర్చారు. ఇంట్లో నిర్భంధించి కొట్టారని ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ కమిషనరేట్‌లో కేసు నమోదుచేశారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో భద్రత విధుల్లో ఉన్నపుడు తనను ఇంట్లో నిర్భందించి దాడి చేశారని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌నని చెప్పినా విన్పించుకోకుండా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.