Harish Rao: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం

Harish Rao: అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2026-01-02 08:40 GMT

Harish Rao: అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం

Harish Rao: అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

గన్‌పార్క్‌ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి నిరసన తెలిపిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడిన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి.. అధికార పక్షం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిందని, బీఏసీ (BAC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను స్పీకర్ అమలు చేయడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. శాసనసభను రేవంత్ రెడ్డి తన పార్టీ ఆఫీస్ అయిన గాంధీభవన్‌లా లేదా సీఎల్పీ సమావేశంలా మారుస్తున్నారని, ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.

"మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి తన నోరు ప్రక్షాళన చేసుకోవాలి" అని హరీశ్‌రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. సభలో సీఎం వాడిన భాష అభ్యంతరకరంగా, బూతుల మయంగా ఉందని ధ్వజమెత్తారు. సీఎంను విమర్శించవద్దని స్పీకర్ చెప్పడం విడ్డూరంగా ఉందని, దేశంలో ప్రధానిని రాహుల్ గాంధీ విమర్శించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల పక్షాన తాము ప్రశ్నలు అడిగితే, ప్రభుత్వం సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా, చిల్లర మాటలతో కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News