Hyderabad: కట్నం సరిపోలేదని.. ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకున్న వధువు..!
Hyderabad: కట్నం సరిపోలేదని పెళ్లి వద్దని చెప్పింది వదువు.
Hyderabad: కట్నం సరిపోలేదని.. ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకున్న వధువు..!
Hyderabad: కట్నం సరిపోలేదని పెళ్లి వద్దని చెప్పింది వదువు. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రెండు లక్షల రూపాయలు కట్నం ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. గురువారం రాత్రి ఏడుగంటల 21 నిమిషాలకు ముహూర్తం నిర్ణియించారు.
ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు ఘట్‌కేసర్‌లోని కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్న అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. తొలుత ఇచ్చిన .2 లక్షలు రూపాయలు కూడా అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.