తెలంగాణ నయాగారా జలపాతంగా బొగత జలపాతం
Bogatha Waterfalls: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతహోరు
తెలంగాణ నయాగారా జలపాతంగా బొగత జలపాతం
Bogatha Waterfalls: తెలంగాణ నయాగారా జలపాతంగా రాణిస్తున్న బొగత జలపాతం సందర్శకులను ఫిదా చేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతం జలహోరుతో ఉగ్రరూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తునుంచి జాలువారుతున్నధార పర్యాటకులను కట్టిపడేస్తోంది. జలపాతం వద్ద సెల్ఫీలు దిగేవారు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పాలధారలా.. నురుగులు కక్కుతూ పరవళ్లు తొక్కుతున్న జలపాతాన్ని దూరంనుంచి చూసి ఆస్వాదించాలేగానీ, దగ్గరికెళ్లి అతి చేష్టలు చేస్తే ప్రాణాంతకమని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.