BJP: పేదోడికి సొంతింటిపై బిజెపి పోరుబాట.. పది జిల్లాల్లో పనులే చేపట్టని వైనంపై బిజెపి ఆగ్రహం
BJP: పది జిల్లాల్లో పనులే చేపట్టని వైనంపై బిజెపి ఆగ్రహం
BJP: పేదోడికి సొంతింటిపై బిజెపి పోరుబాట.. పది జిల్లాల్లో పనులే చేపట్టని వైనంపై బిజెపి ఆగ్రహం
BJP: పేదోడికి సొంతింటి కలను కేసీఆర్ ప్రభుత్వం దూరం చేస్తోందని బిజెపి పోరుబాట పట్టింది. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకం కింద కోట్లకు కోట్లు నిధులు ఇస్తున్నా... వాటిని దారి మళ్లించి తెలంగాణ సర్కారు కాలయాపన చేస్తోందని బిజెపి నాయకులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈనెల 20 తేదీన బాటసింగారం వద్ద మొండిగోడలకే పరిమితమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సందర్శనకు బయలుదేరిని కిషన్ రెడ్డిని మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు.
అన్ని జిల్లాల్లో డబుల్ బెడ్రూ ఇండ్ల నిర్మాణం జరుగుతున్న స్థావరాల్లో బిజెపి నాయకులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. ఇండ్ల నిర్మాణపనుల్లో పురోగతిని తెలుసుకుని ప్రజలకు వాస్తవాలను చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 25 తేదీన హైదరాబాద్ ఇందిరా పార్కువద్ద బిజెపి మహాధర్నా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు.
పేదలకు సొంతింటికలను దూరంచేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతామని, ఎన్నికల హామీలను నెరవేర్చే విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు.
వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలనే డిమాండ్ తో ఆందోళనలు నిర్వహించనున్నారు. రైతు రుణమాఫీ, ధరణి రద్దుపై ఉద్యమం చేపట్టాలని.. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములు సర్కార్ వెనక్కు తీసుకోవడంపై దళితవాడల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. మొత్తం 100 రోజుల ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.