Vijayashanti: బీజేపీకి రాములమ్మ దూరమన్న ప్రచారాన్ని ఖండించిన విజయశాంతి
Vijayashanti: సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా
Vijayashanti: బీజేపీకి రాములమ్మ దూరమన్న ప్రచారాన్ని ఖండించిన విజయశాంతి
Vijayashanti: విజయశాంతి బీజేపీని వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. సొంత పార్టీలోని కొంతమంది నేతలు పనిగట్టుకుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రాములమ్మ ధ్వజమెత్తారు. చిట్‌చాట్‌ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు అలవాటు లేదన్నారు. పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈనెల 16న జరిగిన సమావేశంలో స్పష్టంగా తెలియచేయడం జరిగిందన్నారు విజయశాంతి. ఆ విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇయ్యడానికి తాను వ్యతిరేకిని అని తెలిపారు. బీజేపీకి రాములమ్మ దూరం అంటూ తనపై సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నానని విజయశాంతి వివరణ ఇచ్చారు.