Etela Rajender: కుట్రలు చేసేవారు ఆ కుట్రలకే బలవుతారు
Etela Rajender: హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు కేసీఆర్ చెంప చెల్లుమనిపించారని ఈటల రాజేందర్ అన్నారు.
Etela Rajender: కుట్రలు చేసేవారు ఆ కుట్రలకే బలవుతారు
Etela Rajender: హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు కేసీఆర్ చెంప చెల్లుమనిపించారని ఈటల రాజేందర్ అన్నారు. హుజారాబాద్ ప్రజలకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేనని భావోద్వేగానికి గురయ్యారు. ధర్మాన్ని నిలుపుకోవాలని, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ నన్ను వెళ్లగొట్టిన తరువాత బీజేపీ అక్కున చేర్చుకుందన్నారు. తనకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన వ్యక్తి అమిత్ షా అని తెలిపారు. కేసీఆర్ దుర్మార్గాలను ప్రజలు చీల్చిచండాడారని మండిపడ్డారు.