GHMC ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌.. ముఖ్య నేతలతో రామచందర్‌రావు కీలక సమావేశం

GHMC ఎన్నికలపై టీబీజేపీ ఫోకస్ ముఖ్య నేతలతో స్టేట్ చీఫ్‌ సమావేశం వార్డుల విస్తరణ, ఇబ్బందులు, అభ్యంతరాలపై చర్చ పార్టీ కార్యాచరణపై రామచందర్‌రావు దిశానిర్దేశం

Update: 2026-01-06 07:18 GMT

GHMC ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌.. ముఖ్య నేతలతో రామచందర్‌రావు కీలక సమావేశం

రాబోయే GHMC ఎన్నికలపై టీ బీజేపీ ఫోకస్ పెట్టింది. స్టేట్ చీఫ్ రామచందర్‌రావు అధ్యక్షతన GHMC పరిధిలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. సమావేశంలో రాష్ట్ర సంస్థాగత ఇంఛార్జి చంద్రశేఖర్ తివారీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎన్.గౌతమ్ రావు, NVSS ప్రభాకర్, పార్టీ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల విస్తరణ అంశం, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అభ్యంతరాలపై చర్చించారు. ఎన్నికల కోసం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యాచరణపై నాయకులకు రామచందర్‌రావు దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News