Kishan Reddy: బీఆర్ఎస్‌తో కలవాల్సిన అవసరం మాకు లేదు
Kishan Reddy: పొత్తు ఉంటుందని ప్రచారం చేస్తే చెంప చెల్లుమనిపిస్తాం
Kishan Reddy: బీఆర్ఎస్‌తో కలవాల్సిన అవసరం మాకు లేదు
Kishan Reddy: బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఖండించారు. మెడ మీద తలకాయ ఉన్నోళ్లు.. ఎవరు బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందని అనుకోరని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్‌తో కలవాల్సిన అవసరం తమకు లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెర వెనక రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. ఎవరైనా పొత్తు ఉంటుందని ప్రచారం చేస్తే చెంప చెల్లుమనిపిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు.