Bandi Sanjay: ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌కు పీవీ నరసింహారావు గుర్తుకొస్తారు
Bandi Sanjay: పీవీ జయంతి సందర్భంగా నివాళుర్పించారు బీజేపీ రాష్ట అధ్యక్షులు బండి సంజయ్.
Bandi Sanjay: ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌కు పీవీ నరసింహారావు గుర్తుకొస్తారు
Bandi Sanjay: పీవీ జయంతి సందర్భంగా నివాళుర్పించారు బీజేపీ రాష్ట అధ్యక్షులు బండి సంజయ్. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. పీవీని టీవీ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ నర్సింహారావు 101వ జయంతిని పురస్కరించుకొని ఎక్కడికి పోయాడంటూ బండి ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి కేసీఆర్ బయటకు రాడంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలప్పుడు పీవీని టీవీ అని కేసీఆర్ అన్నాడని, పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు కేసీఆర్ ఎన్ని దేశాల్లో జరిపారని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టే పీవీ నరసింహారావు ఘాట్ కు కూడా సీఎం కేసీఆర్ రాలేదని విమర్శించారు.