భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలాల్లో పెద్ద పులుల అలజడి

* ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్న ఆదివాసీలు, రైతులు

Update: 2021-11-13 03:23 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలాల్లో పెద్ద పులుల అలజడి(ఫైల్ ఫోటో)

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని తిర్లపురం, గుత్తికోయ గ్రామాల్లో పెద్ద పులుల అలజడి మళ్లీ మొదలైంది. దీంతో ఆదివాసీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.

గ్రామస్తుల సమాచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్‌ అధికారులు పులులు సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం సమయంలో ఎవరు అటవీ ప్రాంతాలకు వెళ్ళరాదని, పులులకు ఎలాంటి హాని తలపెట్టినా కఠిన చర్యలు ఉంటాయని ప్రజలను హెచ్చరించారు.

ఇప్పటికే రెండు పులులు పశువుల మందపై దాడి చేయడంతో చనిపోయిన మూగజీవాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అటు ప్రత్యక్షంగా చూసిన పశువుల కాపరులు తాము చెట్లపైకి ఎక్కినట్లు చెబుతున్నారు. అటు ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్‌ అధికారులు పులుల అడుగులను గుర్తించారు. పెద్దపులులే సంచరిస్తున్నట్లు నిర్ధారణ చేసుకున్నారు. అటు ఘటనా స్థలంలో మరో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు.

ఇక పులుల సంచారంతో పినపాక మండలాల్లోని ఆదివాసీలు వ్యవసాయ పనులకు కూడ వెళ్లడం లేదు. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలన్న భయం వేస్తోందంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్‌ అధికారులు తమకు సంరక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News