Bhatti Vikramarka: సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
Bhatti Vikramarka: పోడు రైతులకు హక్కు పత్రాలను ఇవ్వాలని డిమాండ్
Bhatti Vikramarka: సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
Bhatti Vikramarka: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పోలంపల్లిలో లేఖను సీఎల్పీ నేత విడుదల చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్చి 16 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టినట్లు భట్టి వెల్లడించారు. ఇప్పటి వరకు కొనసాగిన పాదయాత్రలో గిరిజనులు, ఆదివాసీలు పోడుభూముల సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపినట్టు భట్టి వివరించారు. పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.