Bhatti Vikramarka: బంగారు తెలంగాణ కాదు.. గడీల పునర్నిర్మాణం జరుగుతోంది

Bhatti Vikramarka: రాష్ట్రంలో భూసంస్కరణల చట్టం అమలులో ఉందా..?

Update: 2023-05-12 13:05 GMT

Bhatti Vikramarka: బంగారు తెలంగాణ కాదు..గడీల పునర్నిర్మాణం జరుగుతోంది

Bhatti Vikramarka: లంగాణలో ఫాం హౌస్‌ల పేరిట నాటి గడీల పునర్నిర్మాణం జరుగుతోందని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గులాబీ ఎమ్మెల్యేలు వందల ఎకరాల్లో ఫాం హౌజ్‌ల పేరిట విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడాన్ని చూస్తుంటే.. రాష్ట్రంలో అసలు భూసంస్కరణల చట్టం అమలులో ఉందా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతుందన్నారు. పీపుల్స్ మార్చ్‌లో భాగంగా.. 57వ రోజు రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో భట్టి పాదయాత్ర కొనసాగింది.

కాంగ్రెస్ హయాంలో నిరు పేదలకు భూములిస్తే.. బీఆర్ఎస్ మాత్రం ఆ భూములను తిరిగి వెనక్కి తీసుకుందని మండిపడ్డారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే భూ బకాసురులుగా మారి ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారాయన.

Tags:    

Similar News