Bhatti Vikramarka: అప్పుల్లో ఉన్న తెలంగాణ... ఇష్టారీతిన వ్యవహరిస్తోంది

Bhatti Vikramarka: లిక్కర్ స్కాములో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్

Update: 2023-05-03 03:00 GMT

Bhatti Vikramarka: అప్పుల్లో ఉన్న తెలంగాణ... ఇష్టారీతిన వ్యవహరిస్తోంది

Bhatti Vikramarka: అప్పుల్లో ఉన్న తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కోవాల్సిన పరిస్థితులను మెరుగుపరచుకోకుండా.. ఇష్టారీతిన వ్యవహరిస్తోందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తెలంగాణ పర్యటనను విజయవంతం చేయాలనే ప్రయత్నంలో ఉన్న ఆయన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పనితీరును ఎండగట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో 47 రోజు ఆలేరు నియోజకవర్గం రాజాపేటనుంచి యాదగిరిగుట్టకు చేరుకుంది. నీతులు చెబుతున్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాములో ఉన్నారని, తెలంగాణనుంచి మద్యం కుంభకోణం, మనీల్యాండరింగ్‌ కార్యకలాపాలకు పాల్పడటంచూస్తే అవినీతి ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చంటున్న భట్టి విక్రమార్క.

Tags:    

Similar News