Beerla Ilaiah: టీపీసీసీ రేవంత్ మాట్లాడిన సందర్భంగా... తెలంగాణ వారికి హిందీ రాదని వ్యాఖ్యనించడం సరికాదు
Beerla Ilaiah: పార్లమెంట్ లో కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ వ్యాఖ్యలపై.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య ఫైర్
Beerla Ilaiah: టీపీసీసీ రేవంత్ మాట్లాడిన సందర్భంగా... తెలంగాణ వారికి హిందీ రాదని వ్యాఖ్యనించడం సరికాదు
Beerla Ilaiah: TPCC చీఫ్ రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ క్షమాపణ చెప్పాలన్నారు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ ఇంఛార్జ్ బీర్ల అయిలయ్య. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. రేవంత్ నుద్దేశించిన కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ వాళ్లకు హిందీ రాదనీ, అందుకే వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఈప్రాంత ప్రజలను అవమానించడమేనన్నారు. తెలంగాణ యాస, రాష్టాన్ని మంత్రి నిర్మల సీతారామన్ హేళనచేసినట్టు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వాఖ్యలు వెన్నక్కి తీసుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డిని అవమానించేలా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీర్ల అయిలయ్య.