Beerla Ilaiah: కేసీఆర్ దళితబంధు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు
Beerla Ilaiah: బండకొత్తపల్లిలో అమ్మవారికి బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు
Beerla Ilaiah: కేసీఆర్ దళితబంధు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు
Beerla Ilaiah: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్థాకొండూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో మెంబర్ సంజీవరెడ్డితో కలిసి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా బండకొత్తపల్లి గ్రామంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వస్థాకొండూరులో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే లాభాలను వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను తెలియజేశారు. పాదయాత్ర వస్థాకొండూరు,పెద్ద పడిశాల, తుర్కలషాపురం, వంగల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కేసీఆర్ రైతు రుణమాఫీ చేయకపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశాడన్నారు. పూర్తిస్థాయిలో ఎక్కడా దళితబంధు ఇవ్వలేదని బీర్ల ఐలయ్య మండిపడ్డారు.