Beds Shortage: సర్కార్‌కు సవాల్‌ విసురుతోన్న బెడ్ల కొరత

Beds Shortage: ఐసీయూల్లో కరోనా రోగులు 15వేల, 747 మంది పెరిగారు

Update: 2021-05-06 06:28 GMT

బెడ్స్ కొరత 

Beds Shortage: బెడ్ల కొరత సర్కార్‌కు సవాల్‌ విసురుతోంది. కరోనా తీవ్రతతో హాస్పిటల్‌లో బెడ్లను పెంచుకుంటూపోతే.. దానికంటే ముందుగా కొవిడ్ పరుగులు తీస్తోంది. గత రెండు వారాలుగా ఆక్సిజన్‌ సరఫరా, ఐసీయూలో వెంటిలేటర్‌ సౌకర్యం ఉన్న బెడ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే అంతకంటే వేగంగా ఈ రెండు అవసరమైన కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చి ఐసీయూకి వెళ్తున్న రోగుల సంఖ్య గత రెండు వారాల్లో వేలల్లో దూసుకుపోతోంది. గాంధీ ఆస్పత్రిలో పూర్తిగా కొవిడ్‌ రోగులకు వైద్యం అందిస్తుండగా, ఇక్కడ ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న, వెంటిలేటర్‌ వసతి కలిగిన పడకలు ఎప్పుడూ ఫుల్‌గా ఉంటున్నాయి.

ప్రభుత్వ లెక్కల్లో గాంధీని మినహాయించింది. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏప్రిల్‌ 20తో పోల్చితే మే 5న సాయంత్రానికి ఆక్సిజన్‌ బెడ్స్‌, ఐసీయూల్లో కరోనా రోగులు 15వేల, 747 మంది పెరిగారు. మొదట్లో ఆ సంఖ్య 5వేల,827 కాగా ఇప్పుడది 21వేల,574గా ఉంది. రెండు వారాల్లో 300 శాతానికిపైగా చేరింది. అదే తేదీల్లో కేవలం ఐసీయూ వరకే తీసుకొన్నా బాధితుల సంఖ్య 2వేల,119 నుంచి 8వేల,41కి పెరిగింది.

హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఐసీయూ బెడ్లన్నీ దాదాపు నిండిపోయాయి. పరిస్థితి విషమించి ఎవరినైనా చేర్చాల్సి వస్తే పడక దొరకడం అసాధ్యంగా మారింది. రెండు వారాల్లో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. హైదరాబాద్‌లో గాంధీ, టిమ్స్‌, కింగ్‌కోఠి, చెస్ట్‌ హాస్పిటల్‌, ఈఎస్‌ఐ, నిమ్స్‌, రైల్వే ఆసుపత్రి ఇలా అన్నింటిలోనూ పడకలు పూర్తిగా నిండిపోయాయి. ప్రభుత్వ ఫీవర్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ పడకలను కూడా వెంటిలేటర్‌ బెడ్లుగా మార్చడంతో కొన్ని ఖాళీలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

అక్కడక్కడా కొన్ని చిన్న హాస్పిటల్‌లో బెడ్లు ఖాళీలున్నా కరోనా బాధితుల ప్రాణభయాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకొని భారీగా దోచేస్తున్నాయి. అక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయన్న నమ్మకం లేకపోయినా.. అత్యవసరానికి ఏదో ఒకటి అని చేరే పరిస్థితి ఉంది. అయితే ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లే సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఆ బిల్లులకు తట్టుకోవడం కష్టంగా మారింది.

Tags:    

Similar News